President's Message
Siva Chava President Message Pic2

సెంట్రల్ ఒహాయో తెలుగు వారందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. నూతనంగా ఎన్నికైన ధర్మకర్తలకు, కార్యవర్గ సభ్యులకు శుభాభినందనలు.

గత సంవత్సరం మనకు కరోనా రూపంలో ఎన్నో చేదు అనుభవాలను మరియు కఠిన సవాళ్ళను మన ముందుంచినది. ఎన్నో విపత్కరపరిస్తితులలోకూడ అన్ని టాకో కార్యక్రమాలు సమర్ధవంతంగా నిర్వర్తించి, దిగ్విజయంగా పూర్తిచేసినందుకు పూర్వ అధ్యక్షులను, వారి కార్యవర్గాన్ని అభినందిస్తున్నాము.

భగవంతుని అనుగ్రహంతో నూతన సంవత్సరంలో అందరం అరోగ్యంగా ఆనందోత్సాహాలతో ముందుకు సాగగలమని, మన టాకో కార్యక్రమాలన్నీ ఇంతకుముందులాగ అందరం కలసి వైభవంగా జరుపుకోగలమని ఆశిస్తూ, దానికి సెంట్రల్ ఒహాయో తెలుగువారందరికీ టాకో కార్యవర్గం ఎళ్ళవేళలా సహాయసహకారాలందించటానికి సంసిద్ధంగా వుంటుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము.

టాకోని మొదటనుంచి ఆదరిస్తున్న దాతలు మరియు టాకో వెన్నుముక లాంటి కార్యకర్తలు వారి సహాయ,సహకారాలు ఇకముందుకూడా అదేవిధంగా కొనసాగిస్తారని ఆశిస్తూ, అభ్యర్ధిస్తూ, నూతన సంవత్సరానికి ఆనందంతో, ఉత్సాహంతో ఆహ్వానం పలుకుతున్నాము

ఇట్లు,

భవదీయుడు,

శివ చావా,

అధ్యక్షుడు-2021